Friday, November 22, 2024

మీ భద్రతకు సహకరిస్తాం.. రష్యాకు చైనా హామీ

రష్యా సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన వ్యవహారాలలో సంపూర్ణ మద్దతు ఇస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో విమర్శలు వస్తున్నప్పటికీ పట్టించుకోని జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మద్దతు ప్రకటించారు. 69వ పుట్టిన రోజు సందర్భంగా పుతిన్‌కు శుభాకాంక్షలు చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన రష్యా, ఇరుదేశాల మధ్య సంబంధాలు స్ధిరంగా, ఎన్నడూలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించింది.

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పరిస్థితులను స్వయంగా అంచనావేశామని, సంక్షోభ నివారణకు అన్నిపక్షాలు ప్రయత్నించాలని జిన్‌పింగ్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు చైనా తనవంతు పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాగా తమ దేశ సమగ్రతకు భంగం కలిగించే విదేశీ శక్తులనుంచి రక్షించుకునేందుకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య తీసుకోవడాన్ని చైనా సమర్థించిందని రష్యా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement