కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాల పథకం (పీఎల్‌ఐ) కింద ఎంపికైన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 7,930 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడితో 8 రకాల అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఉక్కు తయారీకి వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 42,500 కోట్ల పెట్టుబడి సామర్ధ్యం ఉన్న 67 కంపెనీలను సర్కార్ ఇటీవల పీఎల్‌ఐ పథకం కింద ఎంపిక చేసింది. ఇది 70 వేల ఉద్యోగాల కల్పనకు దోహదం చేయనుంది. 26 మిలియన్ టన్నుల ప్రత్యేక స్టీల్ తయారీ సామర్ధ్యాన్ని కంపెనీలు పెంచుకోనున్నాయి.
హెచ్‌ఆర్ కాయిల్ షీట్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలో ఉపమోగించే ఐపీఐ జీఆర్ ప్లేట్లను పీఎల్‌ఐ పథకం కింద ఉత్పత్తి చేయనున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ విమలేంద్ర ఝా తెలిపారు. నిర్మాణాలు, వాహన పరిశ్రమలో ఉపయోగించే పటిష్టమైన షీట్లను కూడా ఈ స్కీమ్ కింద తయారు చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా ప్రత్యేక స్టీల్ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత సంత్సరం 6,322 కోట్లతో పీఎల్‌ఐ పథకాిన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద ఎంపికైన టాటా స్టీల్ కూడా ఏడు రకాల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఆరు రకాలు, ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ నాలుగు రకాలు, ప్రభుత్వ రంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) రెండు రకాల ప్రత్యేక ఉక్కును తయారు చేస్తామని దరఖాస్తు చేసుకున్నాయి.