Sunday, September 15, 2024

National : బిజెపికి ఝ‌లక్…పోటీ చేయనన్న సినీ నటుడు

195 మందితో తొలి జాబితాను ప్రకటించిన మరుసటి రోజే పార్టీకి చుక్కెదురయ్యింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న భోజ్‌పురి సింగర్‌, నటుడు పవన్‌ సింగ్‌ వెనకడుగు వేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి తాను పోటీ చేయలేనని ఎక్స్‌ వేదికగా భాజపా అధిష్ఠానానికి తెలిపాడు.

‘భాజపా అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్‌సోల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను’ అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్‌ సింగ్‌ తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement