పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. పెట్రోధరలు మార్చి 22వ తేదీ నుండి పెరుగుతున్నాయి. 22వ తేదీ నుండి తొమ్మిదిసార్లు పెెరిగాయి. ఎనిమిది రోజులు 80 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లిdలో పెట్రోల్ రూ.101కు చేరుకుంది. ఢిల్లిdలో లీటర్ పెట్రోల్ రూ.101.81, డీజిల్ రూ.93.07గా ఉంది. మార్చి 22వ తేదీ నుండి పెట్రోల్ పైన రూ.6.40 పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.116.72, డీజిల్ రూ.100.94, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.52కు చేరగా, డీజిల్ రూ.100.71కి చేరుకుంది. కాగా జెట్ ఫ్యూయల్ ధర మాత్రం రెండు శాతం పెరిగి కిలో లీటర్‌కు రూ.1,12,924.83కు చేరుకుంది. అంతర్జాతీ యంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి.అయినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరతో పోలిస్తే దాదాపు 30డాలర్లు పెరిగింది. దీపావళి తర్వాత మన వద్ద ధరలు పెరగలేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ పెరగలేదు. దీపావళికి ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ఆయిల్ 70 డాలర్లకు కాస్త పైన ఉంది. ఇటీవల యుద్ధ సమయంలో 130 డాలర్లు దాటినప్పటికీ, ప్రస్తుతం కాస్త తగ్గి 110 డాలర్ల వద్ద ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చమురు ధరలకు సంబంధించి ఏప్రిల్ 1, 2022 కొత్త ధరలను విడుదల చేశాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..