జెట్ ఎయిర్ వేస్ 5.5 బిలియన్ డాలర్లతో పెద్ద సంఖ్యలో విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ కాంట్రాక్ట్‌ను ఎయిర్ బస్సుకు ఇచ్చినట్లు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. ఎయిర్ బస్ ఏ 320 నియో జెట్స్, ఏ220 విమానాలు వీటిలో ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జెట్ ఏయిర్ వేస్ దీవాళీ తీయడంతో కొత్త యాజమాన్యం చేతిలోకి వెళ్లింది.
కొత్తగా జెట్ ఏయిర్ వేస్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందింది. కొత్త యాజమాన్యంలో కొత్త పెట్టుబడితో తిరిగి జెట్ ఏయిర్ వేస్ కార్యకలాపాలు ప్రారం భించనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. కొత్త విమనాలను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయడం ద్వారా మళ్లి మార్కెట్‌లో తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని జెట్ ఏయిర్ వేస్ భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.