Tuesday, November 19, 2024

60 శాతం మంది ఇంటికి.. సెలవులపై పంపేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌

కొవిడ్‌ అవాంతరాల నుంచి విమానయాన సంస్థలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరుగుతోంది. అతర్జాతీయ సర్వీసుల సంఖ్య విస్తరిస్తోంది. పౌరవిమానయానం పుంజుకుంటోంది. త్వరలో కమర్షియల్‌ విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభిస్తాం అని ఇటీవల పేర్కొన్న జెట్‌ఎయిర్‌వేస్‌ ఇంతలోనే ఉద్యోగులకు పిడుగులాంటి ఆదేశాలిచ్చింది. సీనియర్‌ మేనేజర్లు సహా కంపెనీలో పనిచేస్తున్న 60శాతం మంది ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. సెలవుల్లో వారికి ఎలాంటి వేతనం చెల్లించదు. మిగతా ఉద్యోగులకు 50శాతం వరకు వేతనంలో కోత విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం డిసెంబర్‌ 1నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఆర్థికంగా కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతోఈ వ్యవహారం నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు చేరింది. జలాన్‌-కర్లాక్‌ కన్సార్టియం బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ను దక్కించుకుంది. ఈ ఏడాది నుంచి తిరిగి విమాన సర్వీసులు ప్రారంభించాలని కొత్త యాజ మాన్యం భావించింది. అయితే, ఈ కన్సార్టియం రూపొందించిన కంపెనీ పునరుద్ధరణ ప్రణాళికపై జెట్‌ ఉద్యోగులు, సిబ్బంది సంఘం ఎన్‌సీఎల్‌ఎటిని ఆశ్రయించగా, వారికి ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలని గతనెల కన్సార్టియాన్ని ఎన్‌సిఎల్‌ఎటి ఆదేశించింది. ఈ నేపథ్యంలో జలాన్‌-కర్లాన్‌ కన్సార్టియం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియ ప్రకారం ఎయిర్‌లైన్‌ ్స అప్పగింత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, ఇప్పటికీ తమ చేతికి అందలేదనితెలిపింది. ఎయిర్‌లైన్స్‌ భవిష్యత్‌ను కాపాడేందుకు నిధులు ఆదా చేసేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ చర్యల్లో భాగంగానే ఉద్యోగులకు వేతనం లేని సెలవులు, వేతనాల్లో కోతలు అమలు చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలసమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement