జెట్ ఎయిర్‌వేస్ మంగళవారం కీలక ప్రకటన చేసింది. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ మాజీ చీఫ్ విపుల గుణతిలకను.. తమ ఎయిర్‌లైన్స్‌కు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా నియమించుకున్నట్టు జెట్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. గ్రౌండెడ్ క్యారియర్‌ను పునరుద్ధరించే బాధ్యతను విపులకు అప్పగించినట్టు జెట్ ఎయిర్‌వేస్ తెలిపింది. గత నెల చివరి వరకు విపుల.. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కు సీఈఓగా ఉన్నారు. 2022, మార్చి 1 నుంచి జెట్ ఎయిర్‌వేస్‌కు సీఎఫ్‌ఓగా ఉండనున్నట్టు వివరించారు. టర్న్‌రౌండ్ నిపుణుడు, ఏవియేషన్ నిపుణుడిగా విపులకు మంచి పేరుంది. కరోనా మహమ్మారి సమయంలో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు మంచి సేవలు అందించారు. అత్యంత కష్టమైన సమయంలో విజయవంతంగా విధులు నిర్వర్తించారు.
అంతకముందు అంగోలా ఎయిర్‌లైన్స్ కు..
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను గాడిలో పెట్టేందుకు 2018లో విపులను ఎంచుకుంది. సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్లలోపే.. ఆర్థికంగా పటిష్ట స్థాయికి తీసుకొచ్చారు. శ్రీలంకన్ ఎయిర్‌వేస్‌కు సీఈఓగా వెళ్లే ముందు విపుల.. నవంబర్ 2015 నుంచి జులై 2018 వరకు ఎమిరేట్స్ మేనేజ్‌మెంట్ కింద టీఏఏజీ అంగోలా ఎయిర్‌లైన్స్ సీఎఫ్‌ఓగా ఉన్నారు. బోర్డు సభ్యుడిగా కూడా వ్యవహరించారు. నష్టాల్లో ఉన్న అంగోలా ఎయిర్‌లైన్స్‌ను లాభాల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. జెట్ ఎయిర్‌వేస్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, జలాన్ కల్రాక్ కన్సార్టియంలో సభ్యుడైన అంకిత్ జలాన్ మాట్లాడుతూ.. విపుల.. తమ యంగ్ అండ్ ఎనర్జీ టీమ్‌కు మంచి ప్రోత్సాహం ఇస్తారని తెలిపారు. ఏవియేషన్ రంగంలో ఎంతో అనుభవం ఉందని, టర్న్‌రౌండ్ స్పెషలిస్టు అని వివరించారు. ఎన్నో కఠినమైన పరీక్షల తరువాత.. విపులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. జెట్ ఎయిర్‌వేస్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని విపుల అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..