Friday, November 22, 2024

జెట్‌ ఎయిర్‌వేస్ కేసు.. బకాయిలు చెల్లించేందుకు 97 రోజుల గడువు

జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరింత పురోగతి కనిపించింది. ఈ కేసులో జెట్‌ ఎయిర్‌వేస్‌ విన్నింగ్‌ బిడ్డర్‌ జలాన్‌ కల్రాన్‌కు ఎస్‌బీఐ కన్సార్టియంకు బకాయిలు చెల్లించేందుకు అప్పీలేట్‌ ట్రిబ్యూనల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ 97 రోజుల గడువు ఇచ్చింది. 150 కోట్ల రూపాయల బ్యాంక్‌ గ్యారంటీలను ఎస్‌బీఐ ఎన్‌క్యాష్‌ చేసుకోకుండా నిలుపుదల చేసింది. రుణాలు పెరిగిపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ 25 సంవత్సరాల పాటు కార్యకలాపాలు నిర్వహించిన సంస్థ 2019 ఏప్రిల్‌ 18 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా తీయడంతో నిలిచిపోయింది.

2019 జూన్‌ నుంచి సంస్థ దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. 2021 జూన్‌లో కన్సార్టియం సమర్పించిన పునరుద్ధరణ ప్లాన్‌ను ప్రణాళికను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించింది. ఈ ప్లాన్‌ ఇంతవరకు అమలు కాలేదు. గత వారంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ కాలపరిమితి దాటిపోయింది. బిడ్డింగ్‌ గెలుచుకున్న జలాన్‌ కల్రాన్‌ కన్సార్టియం మాత్రం ఇంత వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఎప్పటిలోగా ప్రారంభిస్తారన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement