హైదరాబాద్ (ప్రభ న్యూస్) : భారతదేశపు ప్రముఖ మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫారమ్, జీవన్సతి.కమ్ భారతీయ వినియోగదారుల ఫ్రీ చాట్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు- ప్రకటించింది. ఈసందర్భంగా జీవన్సతి.కమ్ బిజినెస్ హెడ్ రోహన్ మాథుర్ మాట్లాడుతూ… మహమ్మారి కారణంగా భారతీయులు తమ జీవిత భాగస్వా ములను తెలుసుకోవడానికి డిజిటల్ మార్గాన్ని అనుసరించారన్నారు. ఈ విధానంలో ఎటువంటి భయాలు లేకుండా కనెక్ట్ అవ్వడానికి జీవన్సతి వీలు కల్పించిందన్నారు. ఇప్పుడు ప్రజాజీవితం సాధారణ స్థితికి వస్తున్నందున, వినియోగదారులు గతంలో కంటే కూడా మెరుగైన సౌకర్యాలను అందించే ఆన్లైన్ మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫార మ్‌లను చూస్తున్నారన్నారు. తమ కొత్త ఫ్రీ చాట్ ఫీచర్‌తో, భారతీయులు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా పరస్పరం వ్యవహరించాలని తాము కోరుకుంటున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..