Thursday, November 21, 2024

Results: జేఈఈ మెయిన్‌-1 రిజ‌ల్ట్స్‌ రిలీజ్‌ … అద‌ర‌గొట్టిన తెలంగాణ స్టూడెంట్స్‌

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్‌టీఏ అధికార వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ద్వారా జేఈఈ మెయిన్ ఫలితాలు పొందవచ్చు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో పర్సంటైళ్లతోపాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకోవచ్చు.

ఇందులో తెలంగాణకు చెందిన విధిత్‌, సాయితేజ, అనూప్‌, దినేశ్‌ రెడ్డి 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్‌ పొందారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఇక సెషన్‌-2ను ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు సెషన్లు పరీక్ష రాసిన వాళ్లకు) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు.

- Advertisement -

ప‌రీక్ష‌లు రాసింది వీరే..

తొలి విడత పేపర్‌-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీప్లానింగ్‌) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement