బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకులు నేడు వెలువడే అవకాశం ఉంది. నాలుగో విడుత పర్సంటైల్తోపాటు తుది ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించనుంది. దీంతోపాటు కటాఫ్ మార్కులను కూడా విడుదల చేస్తుంది. విద్యార్థులు ర్యాంకుల కోసం అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో చూడవచ్చు.
కాగా, సోమవారం మధ్యాహ్నం నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 (ఆదివారం) సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చల్లించవచ్చు. అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకార అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో ఆలస్యం కావడంతో వాయిదాపడ్డాయి. మెయిన్ క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి వీలుంది.
ఇది కూడా చదవండి: సింగరేణి కాలనీ ఘటనః నిందితుడికి శిక్షించాలన్న కేటీఆర్