దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు రకాల పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఏప్రిల్ సెషన్ లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈనెల 27 28 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నామని పరీక్షలు జరిగే తేదీని 15 రోజుల ముందుగానే విద్యార్థులకు తెలియజేస్తామని NTA తెలిపింది. కాగా ఫిబ్రవరి మార్చి సెషన్ లు ఇప్పటికే ముగిశాయి.