Friday, November 22, 2024

JEE మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్స్ 2024 పేపర్ 2 ఫలితాలను ప్రకటించింది. జనవరి 24న జరిగిన‌ జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 2 పరీక్ష BArch/BePlanning పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. NTA అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. స్కోర్‌కార్డులను యాక్సెస్ చేయడానికి విద్యార్థులు తమ దరఖాస్తు నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

- Advertisement -

జేఈఈ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు :

ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజిలో మీకు కన్పించే JEE (Main) B.Arch B.Planning session 1 క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వివరాలు ఎంటర్ చేయాలి. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాలు ప్రత్యక్షమౌతాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 పరీక్షల్లో దేశవ్యాప్తంగా 23 మంది వందశాతం మార్కులు సంపాదించారు. ఈ 23 మందిలో తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement