హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: జాతీయ స్థాయిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన క్యాలెండర్‌ను జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ప్రకటించింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్, ఐఐటీ, ఎన్‌ఐటీ (ఇంజనీరింగ్) జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య జేఈఈ మెయిన్స్ మొదటి విడత (సెషన్-1) పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగనుంది.
- ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్స్ రెండో విడత (జేఈఈ మెయిన్స్ సెషన్-2) పరీక్షలు జరగనున్నాయి.
- మే 5, 2024వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ఇది పెన్ను, పేపర్, ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది.
- మే 15 నుంచి 31 మధ్య యూనివర్సిటీల యూజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ యూజీ) జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష.
- మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీ-ల పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ) జరగనుంది.
- జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే.