JEE మెయిన్-2025 మొదటి దశ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనన్నారు. ప్రస్తుతానికి, జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు విడుదల అవుతాయి.