సీబీఐ అధికారులు ఇకపై జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని, హుందాగా కనిపించే ఫార్మల్ డ్రెస్సులే వేసుకోవాలని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల హెడ్స్ కచ్చితంగా ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కూడా అందులో తేల్చి చెప్పారు. నిజానికి ఎప్పటి నుంచో ఇలాంటి డ్రెస్సింగ్ సీబీఐలో ఉన్నా.. గత కొన్నేళ్లుగా కొందరు క్యాజువల్స్ వేసుకోవడం ప్రారంభించారని, అయితే ఇన్ని రోజులూ వారిని ఎవరూ ప్రశ్నించలేదని ఓ సీబీఐ అధికారి అన్నారు. ఈ ఆదేశాలు ఒకరకంగా మంచివేనని అభిప్రాయపడ్డారు. గత వారమే సీబీఐ 33వ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్.. రానున్న రోజుల్లో సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి
Advertisement
తాజా వార్తలు
Advertisement