Friday, November 22, 2024

గతిలేక ఉన్నా…. జేసీ దివాకర్ తో మాములుగా ఉండదు

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. మరోవైపు టీడీపీ పార్టీ ఉన్న ఓటు బ్యాంక్ ను కూడా పోగొట్టుకుంది. ఇటువంటి సమయంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గ‌తిలేకే ప్రాంతీయ పార్టీలో ఉన్నాన‌ని… ఎప్ప‌టికైనా జాతీయ పార్టీలే మంచివంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గరకు వచ్చిన జేసీ కాంగ్రెస్ నేత‌ల‌తో స‌ర‌దాగా ముచ్చటించారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మెడ‌ప‌ట్టి గెంటేశార‌ని, ఏపీలో దుర్మార్గ‌పు పాల‌న న‌డుస్తుంద‌న్నారు. బ్ర‌హ్మ‌రాత‌తోనే ఆనాడు ఎలాంటి అర్హ‌త‌లు లేకున్నా కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాడు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ను చూస్తే బాధేస్తుంది. నేనే సీఎం… నేనే సీఎం అంటూ పార్టీని ఈ స్థాయికి తెచ్చారంటూ జేసీ మాట్లాడిన మాటలకు… నేను కాదు అంటూ జీవ‌న్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఇక ఫ్యూచ‌ర్ లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏంటని రాజ‌గోపాల్ రెడ్డి అడ‌గ్గా…ఇంకా ఏం చెయ్యలేం అంటూ తెలిపారు. ఇక ష‌ర్మీల పార్టీ వెనుక ప్ర‌ధాని మోడీ ఉన్నారని , రాయ‌లతెలంగాణ ఇస్తే కాంగ్రెస్ మెరుగ్గా ఉండేద‌ని, కానీ అప్పుడు పొన్నం ప్ర‌భాక‌ర్, వివేక్ ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు జేసీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement