Friday, September 20, 2024

New Chairman | ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా

బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ (మంగళవారం) ప్రకటించింది. ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నకైనా జైషా సరికొత్త రికార్డు సృష్టించాడు. 34 ఏళ్ల వయసులో ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా షా రికార్డు సృష్టించాడు..

కాగా, ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎవరైనా రెండు లేక మూడు పర్యాయాలు ఉండవచ్చు. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా ఉన్న న్యూజిలాండ్‌కు చెందిన బార్ క్లే విముఖత చూపడంతో జైషాని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక బార్ క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దాంతో జైషా డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో భారత్ తరపున ఇప్పటివరకు నలుగురు ఈ పదవిని చేపట్టారు. ఎన్.శ్రీనివాసన్, జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని అలంకరించారు. ఇక ఇప్పుడు జైషా ఐదవ భారతీయుడుగా ఈ పదవిని చేపట్టనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement