కృష్ణ మరణంతో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు నటులు జయసుధ..విజయశాంతి. ఈ మేరకు తనకు సినీ జీవితాన్నిచ్చింది కృష్ణగారే అని.. ఆయనే మా దీపావళి అంటూ కన్నీటిపర్యంతమయ్యారు జయసుధ. హృదయాంతరాళాల్లో ఎంతో బాధ….నేనక్కడ ఉండాలి. మా అంకుల్‌ని చూడాలి… కానీ నేనెక్కడో దూరంగా ఉండిపోవడం నాకు అత్యంత బాధాకరంగా ఉంది. మాటల్లో చెప్పలేని బాధ అంటూ తమ ఆత్మీయుడు, దిక్సూచి, దిశా నిర్దేశి కృష్ణ మృతిపట్ల సినీ నటి జయసుధ కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాటి సింహం లాంటి సినిమాలు గొప్పసినిమాలు చేశాం. ఆయన సరసన నటించడం అంటే మాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. డ్యూయెట్ సాంగ్స్ అయితే నేను కంఫర్టబుల్ ఫీల్ కాలేకోయాను అంటూ ఆయనలేరన్న విషయం దిగమింగలేకపోతున్నామంటూ గద్గద స్వరంతో అన్నారు జయసుధ.నాకు సినీ జీవితాన్నిచ్చింది కృష్ణగారే.
ఆయన చొరవతోనే నేను సినీపరిశ్రమలోకి అడుగుపెట్టానన్నారు. ఆయనే మా దీపావళి.. స్వీయ విమర్శలో ఆయనకు ఆయనే సాటి. తన పర భేదం లేదు. తన సినిమా అయినా తనకు నచ్చకపోతే బహిరంగంగా విమర్శించుకోగల సత్తా ఆయనదని ట్వీట్ చేశారు.ఈ మేరకు నటి విజయశాంతి ట్వీట్ చేశారు.. ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా… నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా… అని, మీరు విజయనిర్మల గారితో అంటే… నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది అని 1980లో ఆంటీ అన్న మాట… నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం. సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్. ఆ “కిలాడీ కృష్ణుడు” నుండి “ఒసే రాములమ్మ” వరకూ ఎన్నో సినిమాలలో కళాకారులుగా కలసి పనిచెయ్యగలిగాం… ఇప్పుడిక వెళ్లిపోయిన ఆంటీతో పాటు మీరు కూడా… అపురూపమైన జ్ఞాపకం.. సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు”.. మీ విజయశాంతి..అంటూ అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.