Saturday, November 23, 2024

సుప్రీంకోర్టులో జయప్రదకు ఊరట..

ప్రముఖ నటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును జయప్రద మద్రాసు హైకోర్టులో సవాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

జయప్రద ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా జయప్రద నిబంధనలను అతిక్రమించిందని థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దీంతో జయప్రద, ఆమె సోదరుడు రాజబాబు, వ్యాపార భాగస్వామి రామ్‌కుమార్‌లపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఆరు నెలల శిక్షను ఖరారు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement