Sunday, November 3, 2024

Japan మూన్‌మిషన్‌.. జాబిల్లిపై క్రియాత్మకంగా “స్లిమ్‌”

జపాన్‌ మూన్‌ ల్యాండర్‌ స్లిమ్‌ మరో మైలురాయిని అధిగమించింది. చంద్రుడిపై రాత్రి వాతావరణాన్ని తట్టుకుని నిలబడింది. సోమవారం ఉదయం జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ (జాక్సా) ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. “రాత్రివేళ స్లిమ్‌కు ఒక కమాండ్‌ పంపించాం. దానికి స్పందన వచ్చింది. తద్వారా రాత్రివేళ కూడా దాని కమ్యూనికేషన్‌ వ్యవస్ధ క్రియాత్మకంగా ఉందని రూఢీ అయింది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నందున, స్లిమ్‌లోని పరికరాలు వేడెక్కుతున్నాయి.” అందుచేత వాతావరణం చల్లబడిన తర్వాత వాటిని యాక్టివేట్‌ చేయడానికి ప్రయత్నించారు. ఇది విజయవంతమైంది.

వాస్తవానికి స్లిమ్‌ జనవరిలో ల్యాండింగ్‌ సమయంలోనే సంక్లిష్టతలను ఎదుర్కొంది. తల్లకిందులుగా ల్యాండ్‌ అయింది. దాంతో దానిపై అమర్చిన సోలార్‌ప్యానళ్లపై సూర్యరశ్మి పడని పరిస్థితి తెలెత్తింది. క్రమంగా, సూర్యుడి గమనంలో మార్పుల తర్వాత ఈ ప్యానళ్లపై ఎండ పడటంతో, స్లిమ్‌ నుంచి కొన్ని ఫోటోలు భూమికి చేరాయి. దాదాపు 10 శిలలను స్లిమ్‌ పరిశోధించింది. నిజానికి దీనిని హార్ష్‌ ల్యాండింగ్‌కు అనువుగా తయారుచేయలేదు. గతంలో చందమామపైకి వెళ్లిన ల్యాండర్లు 10 కి.మీ వెడల్పైన జోన్‌ను లక్ష్యంగా పెట్టుకోగా, ఇది కేవలం 100 మీటర్ల వెడల్పు పరిధిలోని దిగింది. దీంతో జాబిల్లిని చేరుకున్న ఐదవ దేశంగా జపాన్‌ నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement