ఆర్ ఆర్ ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..మరోసారి దర్శకుడు రాజమౌళి టేకింగ్ తో సత్తా చాటారు. కాగా ఈ చిత్రం మూడు నెలల కిందట జపాన్ లో విడుదైంది..కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి అనూహ్య స్పందన లభించింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ 42 కేంద్రాల్లో నేరుగా, షిఫ్ట్స్ పద్ధతిలో మరో 114 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. గతేడాది అక్టోబర్ 21న జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. చిత్రం శతదినోత్సవ మార్కు దాటిన విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విటర్ ద్వారా తెలిజేశారు. జపాన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజుల్లో ఒక సినిమా 100 రోజులు, 175 రోజులు నడుస్తుండటం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధుర జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు మాకు తిరిగి ఆ ఆనందాన్ని కలిగించారు. లవ్ యూ జపాన్ అని ట్వీట్ చేశారు.కాగా ఆర్ ఆర్ ఆర్ ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఈ మధ్యే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. అస్కార్ పురస్కారానికి కూడా నామినేట్ అయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement