Friday, November 22, 2024

భారత్‌పై జపాన్‌ గెలుపు.. 5-2 గోల్స్‌తో హాకీలో ఓటమి

ఆసియా కప్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భాగంగా.. మంగళవారం జపాన్‌, భారత్‌ జట్లు తలపడ్డాయి. గ్రూప్‌-ఏ లీగ్‌లో భాగంగా నిర్వహించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టును జపాన్‌ 5-2 గోల్స్‌ తేడాతో ఓడించింది. తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో డ్రా అవ్వగా.. రెండో మ్యాచ్‌లో ఓటమితో టోర్నీలో ముందుకు వెళ్లడం కొంత కష్టంగా మారింది. చివరి గేమ్‌లో.. ఇండోనేషియాపై భారీ విజయం కూడా.. నాకౌట్‌ దశకు అర్హత సాధించడానికి సరిపోదు. జపాన్‌ తరఫున కెన్‌ కోసియి కవాబే 2 గోల్స్‌ చేయగా.. ఓకా, నాగయోషి, కోజి యమసకిలు ఒక్కో గోల్‌ చేశాయి.

దీంతో జపాన్‌ ఖాతాలో ఐదు గోల్స్‌ చేరుకున్నాయి. ఇక భారత్‌ తరఫున పవన్‌ రాజ్‌భర్‌, ఉత్తమ్‌ సింగ్‌లు గోల్స్‌ చేశారు. జపాన్‌ క్రీడాకారులకు టీమిండియా ఆటగాళ్లు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. తొలి రెండు క్వార్టర్స్‌లో హోరాహోరీ పోరు కొనసాగిందని, తరువాతి రెండు క్వార్టర్స్‌లో ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోలేదని ఇండియన్‌ హాకీ కెప్టెన్‌ లక్రా చెప్పుకొచ్చాడు. చివరి క్వార్టర్‌లో తాము డిఫెన్సివ్‌ స్ట్రక్చర్‌ను కోల్పోయామని, దీంతో రెండు గోల్స్‌ జపాన్‌ ఖాతాలో చేరినట్టు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement