జపాన్ లోని టోక్యోలో ఇవ్వాల (శుక్రవారం) జరగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ టోర్నమెంట్‌లో లక్ష్య సేన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రపంచ నంబర్ 13 వ ర్యాంక్ లో ఉన్న లక్ష్య సేన్.. వరుస సెట్లలో రానించడంతో 21-15, 21-19 పాయింట్ల తేడాతో 33వ ర్యాంక్‌లో ఉన్న స్థానిక (జపాన్) ఆటగాడు కోకి వతనాబేపై విజయం సాధించి వరుసగా మూడో సెమీఫైనల్‌లోకి ప్రవేశించాడు.
అయితే, భారత ద్వయం సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్ శెట్టిల అద్భుతమైన అజేయమైన 12-మ్యాచ్‌ల విన్ స్ట్రీక్ ఇవ్వాల జరిగిన మ్యాచ్ తో ముగిసింది. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ 2023 సూపర్ 750 టోర్నమెంట్‌లో క్వార్టర్-ఫైనల్స్‌లో భారత ద్వయం ఓటమి చవిచూసింది. ప్రపంచ నం.2 జోడీ అయిన సాత్విక్-చిరాగ్ లు పురుషుల డబుల్స్ క్వార్టర్-ఫైనల్ పోరులో 1 గంటా 10 నిమిషాల్లో పోరాడగా.. 15-21, 25-23, 16-21 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ ఛాంపియన్ లీ యాంగ్-వాంగ్ చి-లిన్ చేతిలో ఓటమిపాలయ్యారు.
అదే విదంగా.. HS ప్రణయ్ కూడా మెన్స్ సింగిల్స్ లో ప్రపంచ నం.1 అయిన విక్టర్ అక్సెల్‌సెన్‌పై మంచి పోరాటం చేసాడు.. అయితే పోటీలో మెదటి సెట్ గెలిచినసప్పటికీ తదుపరి రెండు వరుస సెట్స్ లో పాయింట్లు దక్కకపోవడంతో 21-19, 18-21, 8-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.