Tuesday, November 26, 2024

జపాన్ లో మరో కొత్త వైరస్..టోక్యో ఒలింపిక్స్ పై డౌట్స్‌!

ప్రపంచ దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా.. కొత్త రూపు దాల్చింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. అమెరికా, యూకే, భారత్ తదితర దేశాల్లో సెకండ్ వేవ్ లో తన ప్రతాపం చూపిస్తోంది. అయితే, జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ తో విజృంభిస్తోంది. మరో మూడున్నర నెలల్లో ఒలింపిక్స్‌ మొదలుకానున్న తరుణంలో ఫోర్త్ వేవ్‌ ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వైరస్‌ వేరియంట్లు ప్రజలను భయపడుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్లు వెలుగులోకి వస్తుండటంతో కలవరానికి గురి చేస్తోంది. తాజాగా జపాన్‌లోని ‘ఈక్‌’ (E484K) మ్యుటేషన్‌ వెలుగులోకి వచ్చింది. టోక్యో నగరంతోపాటు మరికొన్ని చోట్ల ఈక్‌ మ్యుటేషన్‌ విస్తరిస్తోంది. అయితే, టోక్యోలో వెలుగులోకి వస్తున్న కరోనా కేసుల్లో 70 శాతం కేసుల్లో ఈక్‌ వేరియంట్‌ నిర్థారణ అయినట్లు జపాన్‌ అధికారులు తెలిపారు. ఒసాకా నగరంలో ఈ వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

టోక్యోలో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారీ సంఖ్యలో విదేశీయులు జపాన్‌కు పోటెత్తితే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో క్రీడల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నా.. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్​ను నిర్వహిస్తామని జపాన్ ప్రధాని సుగా స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికే స్ట్రెయిన్ కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త రకం వైరస్ ప్రపంచ దేశాలను అలజడి అలజడి సృష్టిస్తోంది. కరోనా వైరస్‌ కొత్త రూపం జపాన్‌లో కలకలం రేపుతోంది.  బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు జపాన్ లోనూ విస్తరిస్తుండటంతో పాటు.. ‘ఈక్‌’ వైరస్ టెన్షన్ కి గురిచేస్తోంది. వాస్తవానికి 2020 జూలైలో జరగాల్సి ఉండగా 2021కి వాయిదా వేశారు. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలంపిక్స్‌ రీ షెడ్యూల్‌ చేశారు. అయితే ఇప్పుడు కూడా ఈ క్రీడా సంబరాలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement