జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర జపాన్‌లోని ఇవాట్, అమోరి ప్రిఫెక్చర్లలో మంగళవారం ప్రకంపనలు సంభవించాయి.
భూకంపం కేంద్రం ఇవాట్ ప్రిఫెక్చర్ ఉత్తర తీర భాగంలో ఉందని జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. అంతకుముందు, న్యూ ఇయర్ సందర్భంగా పశ్చిమ జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలలో 50 మందికి పైగా మరణించారు. ఈ సమయంలో అనేక భవనాలు, వాహనాలు, పడవలు కూడా దెబ్బతిన్నాయి.
- Advertisement -
భూకంప ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లకు దూరంగా ఉండాలని కోరారు. జనవరి 1న ఇషికావా ప్రిఫెక్చర్, పరిసర ప్రాంతాలను తాకిన దాదాపు 100 భూకంపాలలో 7.6 తీవ్రతతో కూడిన భూకంపం కూడా ఒకటి. ఆ తర్వాత సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు.