అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈ నెల 20న తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చౌటు-ప్పల్, కోదాడల్లో పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి, రూ. 5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందజేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో బయలుదేరి, మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్లి, కొంగర సైదులు కుటుబాన్ని పరామర్శిస్తారు.
ఆ తరవాత కోదాడ వెళ్లి, కడియం శ్రీనివాసరావు కుటు-ంబాన్ని పరామర్శిస్తారు. పర్యటనలో భాగంగా పదిన్నరకు మెట్టు-గూడ అంబేద్కర్ చౌరస్తాలో, 11 గంటలకు ఎల్బీ నగర్ అల్కాపురి సెంటర్, మధ్యాహ్నం 12.30 గంటలకు చౌటు-ప్పల్ మండలం లక్కారం గ్రామంలో ఆగనునున్నారు. అక్కడ సైదులు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతారు. చివరిగా మధ్యాహ్నం 2 గంటలకు కోదాడలో కడియం శ్రీనివాసరావు గారి కుటు-ంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించి రూ. 5 లక్షల చెక్ అందజేస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..