Sunday, January 12, 2025

Jannaram – చిన్నమ్మను హత్య చేసిన అక్క కొడుకు

జన్నారం, (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఆదివాసి ఒంటరి మహిళను అక్క కొడుకు నేటి ఉదయం గొడ్డలతో నరికి హత్య చేసిన సంఘటన చర్చనీయాంశమైంది.

మండలంలోని దేవునిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరుపల్లె పర్డానిగూడకు చెందిన మడావి కౌసల్య (48)ను అదే గ్రామానికి చెందిన అక్క కొడుకైన కుర్సెంగ కృష్ణ గ్రామ సమీపాన ఉన్న పొలం వద్ద ఆదివారం ఉదయం గొడ్డలితో నరికి హత్య చేశాడు.ఆ గ్రామ సమీపాన ఉన్న పెద్దమోరి పొలం వద్ద ఉదయం సాగునీరు పెట్టడానికి వెళ్లిన కౌసల్యను అదును చూసి వెంబడించి కృష్ణ గొడ్డలితో నరికి హత్య చేశాడు.

ఆ తర్వాత నిందితుడైన కృష్ణ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.నిందితునికి గత కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగా లేనట్లు తెలిసింది.స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని,కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement