బీహార్‌లోని సహర్సాలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ సహర్సా నుంచి పాట్లీపుత్ర వెళ్తున్న జన్హిత్ ఎక్స్‌ప్రెస్ హుక్ విరిగింది. దీంతో రైలు రెండు భాగాలుగా విడిపోయి ట్రాక్‌పై పరుగులు తీయడం ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో కొంతదూరం ట్రాక్‌పై పరిగెత్తడంతో రెండు భాగాలు ఆగిపోయాయి.
దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జన్హిత్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11:20 గంటలకు పాట్లీపుత్రకు వెళ్లడానికి సహర్సా నుండి బయలుదేరింది. ఈ రైలు సిమ్రి భక్తియార్పూర్ స్టేషన్ నుండి ముందుకు కదిలి కోపారియాకు చేరుకోబోతుండగా, సుమారు 12గంటల సమయంలో అకస్మాత్తుగా బలమైన షాక్ తగిలి ఈ రైలు హుక్ విరిగింది… దీంతో రైలు బోగీలు విడిపోయాయి… అనంతరం తిరిగి వాటిని కలిపి రైలును పంపించారు సిబ్బంది..