నేడు జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. గుంటూరు జిల్లా ఇప్పటంలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరుగనుంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి అయిదు లక్షల మంది వరకు పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికి హాజరయ్యే నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ నాయకత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ బాధ్యతను కమిటీలకు అప్పగించింది. సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సందేశం ఇస్తారని తెలస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్.. భవిష్యత్ కార్యచరణపై కూడా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.