Friday, November 22, 2024

సాగర్ బరిలో జనసేన ?

తెలంగాణలో క్యాడర్‌ను బలోపేతం చేయడంపై జనసేనాని దృష్టి కేంద్రీకరించారు. బీజేపీతో ఎలాంటి పొత్తులు లేకుండానే త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్ కార్పొ రేషన్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల బరిలో నిలిచేందుకు వ్యూహరచన లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమకున్న అభిమానులను పార్టీలోకి
ఆహ్వానించేందుకు పవన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వెనకబడిన సామాజికవర్గాలను ఆకట్టుకునే విధంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయులు తెలుపుతున్నారు. ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే
జనసేన పోరాటం’ అనే నినాదంతో తెలంగాణలో విస్తృతంగా జనసేన పార్టీని విస్తరించేందుకు జనసేన అధ్యక్షులు వ్యూహం పన్నుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఒంటరి పోరాటానికే సిద్ధం

తెలంగాణ నుంచేతమ ఉద్యమం మొదలవుతుందన్న జనసేన త్వరలో తెలంగాణలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో
తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యాడరను అలర్ట్ చేయడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కమిటీలు వేయడం జరిగింది.
ఉపఎన్నికలో పోటీ చేయడమా లేక.. ఇతర పార్టీలకు మద్దతు
ఇవ్వడమా..! అన్నది ఇంకా స్పష్టం లేదని ఆ పార్టీ వర్గీయులు
తెలుపుతున్నారు. బీజేపీతో మాత్రం పొత్తుకు సముఖంగా లేమన్న
విషయాన్ని స్పష్టంగా ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.


ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి రెడీ


బీజేపీతో పొత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి
తప్పుకున్న జనసేన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ
చేసేందుకు రెడీ అవుతుంది. ఆ ప్రాంతాల్లో కమిటీలు వేస్తూ.. క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు పారీ నాయకత్వం కసరతు చేసోంది. వర్గాలు తెలుపుతున్నాయి. జనసేన పార్టీ పెట్టిన మొదట్లో 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మల్కాజ్ గిరినుంచి పోటీ చేసింది. అనంతరం తెలంగాణ కంటే ఆంధ్రావైపే ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారు. తెలంగాణలో వ్యక్తిగత అభిమానుల సూచనల మేరకు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాడర్ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ పొత్తుపై తెలంగాణ
జనసేన క్యాడర్ మొదటి నుంచి పరోక్షంగావ్యతిరేకిస్తూ వస్తోంది. ఇరు పార్టీ పొత్తుల కారణంగా రాష్ట్రంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో బీజేపీతో జనసేన కలిసి పని చేంది. బీజేపీ కేంద్రనాయకత్వం సూచనల మేరకు రాష్ట్రంలో జనసేన పార్టీ నడుచు
కున్నప్పటికీ.. తెలంగాణ బీజేపీ జనసేనకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకపోగా జనసేన నాయకత్వం అంసృప్తి వ్యక్తం
చేసింది. తెలంగాణ జనసేన నేతలు పవన్క ళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ.. కేంద్ర నాయకత్వానికి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన తమ అభ్యర్థులను విత్ డ్రా చేయించి.. పూర్తిస్థాయిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇంతటి త్యాగం చేసినప్పటికీ తెలంగాణ బీజేపీ నాయకత్వం జనసేన పార్టీ క్యాడర్‌కు తగిన మర్యాద ఇవ్వకపోగా.. పార్టీని చులకనగా చుస్తూ.. అవహేలన చేస్తోందని ఇటీవల జనసేన అధినేత బహిరంగంగా వెల్లడించారు.రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీని సంప్రదించలేదని జనసేన వర్గాలు తెలుపుతున్నారు. అందుకే హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గం టిఆర్ఎస్ బలపరిన ఎమ్మెల్సీవాణీ దేవికి మద్దతు తెలిపారని ఆ పార్టీ అధినేత బహిరంగంగానే చెప్పారు ఇకపై బిజెపితో భవిష్యత్తులో ఎలాంటిి పొత్తులు ఉండవని అన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement