తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. జనార్థన్ రెడ్డితో పాటుగా ఏడుగురు సభ్యులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా సభ్యులుగా రమావత్ ధన్సింగ్ (బీటెక్-సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ), ప్రొఫెసర్ బీ లింగారెడ్డి (ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఫిజిక్స్ విభాగాధిపతి, సీబీఐటీ), కోట్ల అరుణకుమారి (బీఎస్సీ బీఈడీ, ఎంఏ ఎల్ఎల్బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్), సుమిత్ర ఆనంద్ తనోబా (ఎంఏ తెలుగు, తెలుగు పండిట్), కారం రవీందర్‌రెడ్డి (బీకాం, రిటైర్డ్ ఉద్యోగి, టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు), అరవెల్లి చంద్రశేఖర్‌రావు (బీఏఎంఎస్, ఉస్మానియా, ఆయుర్వేద డాక్టర్), ఆర్ సత్యనారాయణ (బీఏ, జర్నలిస్ట్)ను సీఎం కేసీఆర్ నియమించారు.