అమరావతి : ఆపదలో ఉన్న తోటి కార్యకర్తకు సాయంగా నిలవాలన్నదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని, మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ఓ భావోద్వేగ ప్రయాణమన్నారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మొదట్లో 90 వేల మంది క్రియాశీలక సభ్యులను జాయిన్ చేశామని… కోవిడ్ సమయంలోనూ రూ.500 కట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రెండో విడతలో ఏకంగా 3 లక్షల 30వేల మంది క్రియాశీల సభ్యులుగా చేరారన్నారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. బాధితులకు బీమా క్లైయిమ్ కూడా 60 రోజుల్లో అందేలా పార్టీ లీగల్ విభాగం ప్రయత్నిస్తోందని తెలిపారు. సభ్యత్వ నమోదు కోసం కేవలం పార్టీ కార్యకర్తలే కాదు.. సగటు కూలీలు, పేదలు కూడా ఎదురుచూడటం గొప్ప విషయమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement