మంగళగిరి: రాష్ట్రంలో జరగుతున్న పరిణమాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా మారిశెట్టి మురళీ మోహన్ ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’. పేరుతో గ్రంధస్తం చేశారు. ఆ పుస్తకాన్ని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి . గ్రంధకర్త మురళీ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికీ, ఈ రంగంలో ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు.
అనంతరం జరిగిన పార్టీ నేతల సమావేశంలో మాట్లాడిన జనసేన అధ్యక్షుడు , ముందస్తు ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు.. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.. సామాన్యుడిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని వైకాపా భావిస్తోందని అన్నారు. వైకాపా దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడమే అని వ్యాఖ్యానించారు. పవన్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్నాం. రాష్ట్రంలో తాజా పరిణామాలతో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేన నేతలకు త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి. కేవలం నా చుట్టూ తిరిగితే మీరు నాయకులైపోరు. డబ్బు ఇచ్చి సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదు. వచ్చే 25 ఏళ్ల గురించి ఆలోచించే నేతలు కావాలి. భావితరం గురించి ఆలోచించే నేతలు వేరే పార్టీల నుంచి వస్తే ఆహ్వానిస్తా. జగన్ అనే ఒక దుష్ట నాయకుడిపై మనం పోరాడాలి’’ అని పవన్ అన్నారు. అలాగే సినిమాలలో నటించడంతో వచ్చే ఆదాయమే రాజకీయాలలో ముందుకు నడించేందుకు ఆక్సిజెన్ గా ఉపయోడపడుతున్నదని అన్నారు.