పరిశ్రమల ఏర్పాటుకి రాష్ట్రంలో ఒక్క పాలసీ కూడా లేదని, రాష్ట్ర పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ, జనసేన సీట్ల పంపకాలపై వస్తున్న ప్రచారంపై పవన్‌నే అడగాలన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సరైన దిశ దశ లేక పోవడానికి కుటుంబ రాజకీయాలే కారణమన్నారు. తిరుమలలో గదులకు రేట్లు పెంచడాన్ని నిరశిస్తూ టీటీడీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఏపీలో బీజేపీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే… తమ పార్టీ చేసే సంక్షేమం ముందు జగన్ చేసే సంక్షేమం బలాదూర్ అన్నారు. సంక్షేమంపై దమ్ముంటే జగన్, చంద్రబాబు చర్చకు రావాలన్నారు. రేషన్ బియ్యం పంపిణీ కోసం కేజీకి 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రేషన్ బియ్యం పంపిణీ వాహనాలపై నరేంద్ర మోదీ ఫోటో వెయ్యాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయి.. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోము వీర్రాజు
Advertisement
తాజా వార్తలు
Advertisement