ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన జన ఔషధి మందుల షాపులు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. 2024 నాటికి వీటి సంఖ్యను 10వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 766 జిల్లాలకుకు గానూ, 743జిల్లా కేంద్రాల్లో 9 వేల జన ఔషధి మందుల షాపులు ఉన్నాయి. ఈ షాపుల వల్ల 8 సంవత్సరాల్లో 19 వేల కోట్ల రూపాయల వరకు ప్రజల సొమ్ము ఆదా అయ్యిందని కేంద్రం తెలిపింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వీటి సంఖ్యను పది వేలుకు పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాక పరిధిలోని షార్మాస్యూటికల్స్ విభాగం 2008 నవంబర్‌లో జన పౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
2017 నాటికి 3 వేల షాపులు ఏర్పాటు చేశారు. 2020 మార్చి నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ప్రస్తుతం 9 వేలకు చేరింది. జన ఔషధి జనరిక్ మందుల షాపుల్లో బ్రాండెడ్ ఔషధాలతో పోల్చితే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. మొత్తం 1759 ఔషధాలు, 280 సర్జికల్ పరికరాలు ఈ కేంద్రాల్లో లభిస్తాయి. ఈ ఆర్ధిక సంవత్సరం ఈ కేంద్రాల ద్వారా 758.69 కోట్ల విక్రయాలు జరిగాయి. జన ఔషధి కేంద్రాల ద్వారా యువతకు స్వయం ఉపాధి సైతం లభిస్తోంది.
ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది. ప్రజల్లో జనరిక్ ఔషధాల పట్ల క్రమంగా ఆధారణ పెరుగుతున్నది. వీటి పట్ల కొంత మంది వైద్యులు సైతం వ్యతిరేకతతో ఉండటం వల్ల అనుకున్నంత వేగంగా వీటికి ఆదరణ లభించడంలేదు. అందువల్లే ప్రజభుత్వం వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రచారం కూడా నిర్వహిస్తోది. బ్రాండె డ్ మందులకు, జనరిక్ మందులకు ఎలాంటి తేడాలేదని ప్రభుత్వం చాలా కాలంగా ప్రచారం నిర్వహిస్తున్నది.