Sunday, November 17, 2024

J&K Elections – బిజెపి తొలి జాబితా విడుదల

జమ్ము కశ్మీర్‌ – సుమారు పదేండ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ తాజాగా తొలి జాబితాను విడుదల చేసింది. 44 అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం రిలీజ్‌ చేసింది.

మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. ఆగస్టు 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -

కాగా, రామ్‌ మాధవ్‌, కిషన్‌ రెడ్డిలను ఎన్నికల ఇన్‌చార్జిలుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement