Wednesday, September 18, 2024

Jammu Kashmir : ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం.. మోడీ

దోడా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోదీ శ‌ప‌థం
జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోందన్నారు ప్ర‌ధాని మోదీ. ఇప్పటికే ఉగ్ర‌వాదంపై పోరు ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో ఆ భూతాన్ని శాశ్వ‌తంగా నిర్మూలిస్తామ‌ని చెప్పారు.. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నేడు దోడాలో జ‌రిగిన బీజేపీ ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ… ఈ అందమైన ప్రాంతాన్ని నాశనం చేసిన రాజవంశ రాజకీయాలను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం కొత్త నాయకత్వాన్ని ప్రతిపాదించిందన్నారు.

“స్వాతంత్ర్యం తర్వాత, జమ్మూ , కాశ్మీర్ విదేశీ శక్తుల లక్ష్యంగా మారింద‌న్నారు మోదీ. అలాగే రాజవంశ రాజకీయాలు ఈ అందమైన ప్రాంతాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌ని మండిప‌డ్డారు.. రాజ‌కీయ రాజ‌వంశాలు త‌మ పిల్ల‌ల‌ను ప్రొజెక్ట్ చేసి కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వలేద‌ని ఇటు మ‌హ‌బూబా ముఫ్తీ, అబ్దుల్ ఫ‌రూఖ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రెండు జండాలు, రెండు రాజ్యాంగాల వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ద్దు చేసి క‌శ్మీర్ కు సంపూర్ణ స్వాతంత్ర దేశంగా మార్చిన ఘ‌న‌త మాదేన‌న్నారు.. 370 అర్టికల్ ను ర‌ద్దు చేసి కశ్మీర్ పండిట్లకు స్వేచ్చ క‌లిపించింది తామేన‌ని చెప్పారు మోదీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రాష్ట్రాన్ని పాలించిన వారు త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యత ఇచ్చార‌ని ఆరోపించారు.. వాళ్లు మాత్ర‌మే ఎదిగార‌ని, ప్ర‌జ‌లు మాత్రం దిగువ స్థాయిలోనే ఉన్నార‌ని అన్నారు మోదీ.. అందుకే తాము 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంపై తమ దృష్టి సారించామ‌న్నారు.. తామ గెలిస్తే క‌శ్మీర్ ను మ‌రింత అభివృద్ధిపదంలో న‌డుపుతామ‌ని మోదీ హామీ ఇచ్చారు. అంత‌కు ముందు మోదీ దోడాలో ఎన్నిక‌ల ర్యాలీ నిర్వ‌హించారు..

- Advertisement -

భారీ భ‌ద్ర‌త …42 ఏళ్ల త‌ర్వాత ప్ర‌ధాని హోదాలో ప‌ర్య‌ట‌న ..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కిష్త్‌వాడ్‌, ఉధంపుర్‌, పూంఛ్‌, రాజౌరీ జిల్లాల్లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్లను మరింత పెంచినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా రెండోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. గత 42ఏళ్లలో భారత ప్రధాని జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్‌ జరగనుంది. చీనాబ్‌ లోయలోని కిష్త్‌వాడ్‌, రాంబన్‌, దోడాతో పాటు దక్షిణ కశ్మీర్‌ జిల్లాల్లోని మొత్తం 24 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement