Friday, November 22, 2024

Jammu – ఆర్మీ శున‌కం పాంట‌మ్ వీర‌మ‌ర‌ణం

ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు అడ్డుప‌డ్డం పాంట‌మ్
కాల్పుల‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ పాంట‌మ్
చికిత్స కోసం త‌ర‌లిస్తుండ‌గా విడిచిన ప్రాణం
జ‌మ్ముక‌శ్మీర్ అఖ్నూర్ లో ఘ‌ట‌న

జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్ర‌వాదులు జ‌వాన్ ల‌పై కాల్పులు జ‌రుపుతుండ‌గా అడ్డుప‌డింది..ఈ స‌మ‌యంలోనే ఫాంటమ్ కి బుల్లెట్లు తగిలాయి. చికిత్స కోసం త‌ర‌లిస్తుండ‌గానే వీర‌మ‌ర‌ణం పొంందింది. ఇక ఇక్కడ జ‌రిగిన కాల్పుల‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు కూడా హ‌త‌మ‌య్యారు..

కాగా, ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం. అది 2020, మే 25న జన్మించింది. ఫాంటమ్ ఒకటి. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పోరాడేందుకు శిక్షణ పొందిన శునకం. మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుండి ఈ శునకాన్ని తీసుకువచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్‌లో ఉంది. పాంట‌మ్ వీర‌ణంపై స్పందించిన ఆర్మీ ‘మా నిజమైన హీరో, ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ డాగ్, ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నాం’ అని భారత ఆర్మీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement