కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం
విధులలో ఉన్న ఇద్దరు జవానుల అపహరణ
కిడ్నాపర్ చెర నుంచి తప్పించుకున్న జవాన్
మరొకరిని హత్య చేసిన ఉగ్రమూకలు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అయితే వారిలో ఒక జవాన్ చాకచక్యంగా ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని వెనక్కి వచ్చారు. కాగా, మంగళవారం జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ సమయంలో.. 161 యూనిట్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు అనంత్‌నాగ్‌లోని ఫారెస్ట్ ప్రాంతంలో అపహరణకు గురయ్యారు.
ఒకరికి బుల్లెట్ గాయాలు తగిలినప్పటికీ, ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డారని మీడియా కథనాలు వెల్లడించాయి. తర్వాత సైన్యం భారీఎత్తున సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టింది. ఆ క్రమంలో బుల్లెట్, కత్తి గాయాలతో ఉన్న మరో సైనికుడి మృతదేహం నేడు లభ్యమైంది. గాయపడిన జవాన్ పరిస్థితి ప్రస్తుతం నిలకగా ఉందని అధికారులు తెలిపారు. ఫయాజ్ అహ్మద్ షేక్ అనే మరో జవాన్ తప్పించుకోగలిగాడు కానీ గాయపడ్డాడు. అతని భుజం, ఎడమ కాలికి గాయాలయ్యాయి. చికిత్స కోసం 92 బేస్ హాస్పిటల్ శ్రీనగర్‌కు తరలించారు.