Thursday, November 14, 2024

Jammu and Kashmir – ఒమ‌ర్ అబ్దుల్లానే ముఖ్య‌మంత్రి….

ప్ర‌క‌టించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ ఎన్నిక‌ల‌లో ఎన్ సి కూట‌మిదే విజ‌యం
ఎన్ సి కూట‌మికి 51 స్థానాల‌లో ఆధీక్యం

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28 చోట్ల లీడ్ లో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల లీడ్ లో ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ కు కాబోయే ముఖ్యమంత్రి పేరును నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. తదుపరి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అని ఆయన చెప్పారు. ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. మరోవైపు, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకే జమ్మూకశ్మీర్ సీఎంగా పని చేశారు. ఇండియా కూటమి అధికారాన్ని చేపట్టబోతున్న నేపథ్యంలో అబ్దుల్లా నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement