జమ్ము కాశ్మీర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ వాహనం లోయలో పడి నలుగురు జవాన్లు మృతి చెందారు. జమ్ము-కాశ్మీర్లోని బందిపురా జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనాల్లో ఒకటి అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.. ఇక హుటాహుటిన అక్కడికి చేరుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆర్మీ హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement