జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ పేర్కొంది. 2024 ఎన్నికల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం కుదరదని లా కమిషన్ తెలిపింది.
2029లో జమిలి ఎన్నికల కోసం లా కమిషన్ కసరత్తు చేస్తోంది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై తన వైఖరిని లా కమిషన్ తెలిపింది. ఇటీవలే పలు పార్టీల నేతలు తమ ప్రసంగాల్లో త్వరలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ఊహాగానాలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఊహాగానాలకే చెక్ పెట్టినట్లైంది. ఎట్టకేలకు ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల్లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ ఈ జమిలి ఎన్నికలపై స్పష్టత నిచ్చింది.