Tuesday, November 26, 2024

జమిలి ఎన్నికలపై మరింత లోతుగా..

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబందించిన విష‌యాల‌ను మ‌రింత మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపామ‌ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిర‌ణ్ రిజుజు పేర్కొన్నారు.  విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్‌ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసిందని. ఇవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని అన్నారు. 

దేశంలో తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీగా వ్యయ ప్రయాసలు తప్పడం లేదని భావిస్తున్న కేంద్రం.. ఈ దిశగా న్యాయ కమిషన్ చేసిన సిఫార్సులను పరిశీలిస్తున్నట్లు ఇవాళ వెల్లడించింది. దీంతో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కేంద్రం చేసిన ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అయితే ఎప్పటికల్లా ఈ జమిలి ఎన్నికలు ఉండొచ్చన్న దానిపై మాత్రం కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు.

జమిలి ఎన్నికలు ఎందుకంటే:

ప్ర‌తి ఏడాది దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి.  ఇలా రాష్ట్రాల ఎన్నిక‌లు, లోక్‌స‌భ ఎన్నిక‌లు వేరువేరుగా నిర్వ‌హించ‌డం వ‌ల‌న అధిక‌వ్య‌యం అవుతున్న‌ది.  అంతేకాకుండా అభివృద్ది సైతం కొంత వెన‌క‌బ‌డే అవ‌కాశం ఉంటుంది.  దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు, లోక్‌స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల‌న ఒకేసారి ఖ‌ర్చు చేస్తే స‌రిపోతుంది.  దేశంలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కేంద్రం నిధులు కేటాయిస్తే, రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ఆయా రాష్ట్రాలు నిధులు స‌మ‌కూర్చుకోవాలి.  అదే అన్ని ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హిస్తే ఖ‌ర్చును కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు స‌మానంగా పంచుకోవాలి. ఫ‌లితంగా రాష్ట్రానికి కొంత డ‌బ్బు ఆదా అవుతుంది.  అంతేకాదు, రాష్ట్రాల్లో సంక్షేమ కార్య‌క్ర‌మాల నిర్వాహ‌ణ‌కు ఇబ్బందులు త‌లెత్త‌వు.\

ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిషోర్ రాజీనామా..

Advertisement

తాజా వార్తలు

Advertisement