Friday, November 22, 2024

IPL 2024 | 15 బంతుల్లో జేక్ హాఫ్ సెంచరీ.. వాళ్ల రికార్డు బ్రేక్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా నేడు జ‌రుగుతున్న మ్యాచ్‌లో… ఢిల్లీ క్యాపిటల్స్‌ యంగ్ ప్లేయర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఈ సీజన్‌లో తక్కువ బంతుల్లోనే హాఫ్​ సెంచరీ సాధించిన రికార్డు సృష్టించాడు. ఇదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ ఫాస్టెస్ట్ 50 బాది రికార్డు క్రియేట్ చేయగా.. కొద్దిసేపట్లోనే ఆ రికార్డును జేక్ ఫ్రేజర్ బ్రేక్ చేశాడు. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 267 పరుగుల టార్గెట్ చేజ్‌లో భాగంగా 15 బంతుల్లోనే 53 బాదాడు. అనంతరం 65 పరుగులు చేసి మయాంక్ మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

- Advertisement -

ఈ సీజన్ ఫాస్టెస్ట్ 50లు..

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ – 15 బంతులు vs సన్‌రైజర్స్ హైద‌రాబాద్.
ట్రావిస్ హెడ్ – 16 బంతులు vs ఢిల్లీ క్యాపిటల్స్.
అభిషేక్ శర్మ – 16 బంతులు vs ముంబై ఇండియన్స్.
సూర్యకుమార్ యాదవ్ – 17 బంతులు vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఇక, అంతకు ముందు సీజన్లలో జైస్వాల్ 13 బంతుల్లో, పాట్ కమిన్స్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement