మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎస్.జైపాల్ రెడ్డి 83వ జయంతిని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న ఎస్. జైపాల్ రెడ్డి జయంతిని స్టేట్ ఫంక్షన్‌గా జరుపుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత అధికారులతో సీఎస్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
నెక్లెస్ రోడ్‌లో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్‌లో సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హెచ్‌ఎండీఏ కమీషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు శానిటేషన్, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు.