Monday, November 11, 2024

TG | జైనూర్ ఆదివాసీ మహిళ డిశ్చార్జ్… పరామర్శించిన మంత్రి సీతక్క

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి హైదరాబాద్ బ్యూరో : నెల రోజుల కిందట జైనూరులో లైంగిక దాడికి గురై చావు బతుకుల మధ్య గాంధీ ఆసుపత్రిలో చేరిన ఆదివాసి మహిళను ఆదివారం డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆసుపత్రిలో బాధితురాలిని కలిసి దుస్తులు, నగదు అందించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పడంతో డిశ్చార్జ్ చేసి ప్రత్యేక వాహనంలో జైనూరుకు తరలించారు. ప్రభుత్వ వైద్య ఖర్చులతో ఆమె ఆరోగ్యం మెరుగైందని సీతక్క ఒక‌ ప్రకటనలో తెలిపారు.

ఆదివాసీ సమస్యలపై సీతక్కను కలిసిన సోయం..

ఏజెన్సీలో ఆదివాసీల పై పెరుగుతున్న దాడులు, అక్రమ కేసులపై మాజీ ఎంపీ, తుడుం దెబ్బ నాయకులు సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఆదివాసి సంఘాల నాయకులు ఆదివారం హైదరాబాదులో మంత్రి సీతక్కను కలిశారు. జైనూరు ఘటనలో అమాయక ఆదివాసులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని…. ఏజెన్సీలో తమకు రక్షణ లేకుండా పోయిందని మంత్రి సీతక్కకు వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి తో ఆదివాసి సంఘాల నేతలతో భేటీ ఉంటుందని, గిరిజన హక్కులు చట్టాల గురించి సమస్యల గురించి విన్నవించుకోవాలని సీతక్క తమకు హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement