Saturday, November 23, 2024

అభివృద్ధా.. ఆధ్యాత్మికమా!

పవిత్రత.. ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
అభివద్ధి పేరుతో పర్యాటకుల రద్దీ వద్దు
ఆధ్యాత్మిక కేంద్రాలకు పర్యాటక శోభ
తిరుమల సహా అన్ని క్షేత్రాల్లోనూ మార్పులు
ఎంతోమందికి ఉపాధి అవకాశాలు
ఆదాయం కోసం ప్రభుత్వాల చర్యలు
అదే తరహాలో జార్ఖండ్‌ నిర్ణయం
కానీ భక్తికే ప్రాధాన్యమిస్తున్న జైనులు
ఇతర మతాల వారికి స్ఫూర్తినిచ్చే అవకాశం
జైనుల పవిత్రక్షేత్రం సమ్మద్‌ శిఖర్జీ
జైన తీర్థంకరుల పాదముద్రలతో ప్రత్యేకత
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే యత్నం
జార్ఖండ్‌ ప్రభుత్వ నిర్ణయం
వ్యతిరేకిస్తున్న జైనులు

న్యూఢిల్లీ, (ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – తమ మతానికి చెందిన పవిత్ర స్థలాన్ని యాత్రాస్థలంగా మార్చి కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధిపరుస్తా మంటూ జార్ఖండ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై దేశ వ్యాప్తంగా ఉన్న జైనులంతా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. తమ పవిత్ర స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రతిపాదనను వీరు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు జైనుల ఉద్యమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇతర మతాల్లో కూడా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. హిందువుల పవిత్ర దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యాధునిక వసతులతో గొప్ప యాత్రా స్థలంతోపాటు పర్యాటక విలాస కేంద్రంగా ప్రభుత్వాలు అభివృద్ధిపరుస్తున్నాయి. ప్రధాన ఆలయ పరిసరాల్లో స్థలాల్ని జాతీయ, అంతర్జాతీయస్థాయి కార్పొరేట్‌ పారిశ్రా మిక వాణిజ్య దిగ్గజ సంస్థలకు కేటాయిస్తున్నాయి. ఆయా సంస్థలు ప్రధాన ఆలయ సమీపాల్లో అత్యాధునిక వసతులతో కూడిన విలాస మందిరాల్ని నిర్మిస్తున్నాయి. ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు తిరుమల యాత్రను ఓ పవిత్ర భావంతో కాకుండా విలాసవంతంగా పూరి ్తచేస్తు న్నారు. వారు రాని సమయాల్లో ఈ భవనాల్ని టీటీడీ అద్దెలకిచ్చి ఆదాయం పొందుతోంది. ఒక్క టీటీడీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా హిందూ పవిత్ర పుణ్య క్షేత్రాలన్నీ అంచెలంచెలుగా పర్యాటక కేంద్రాలుగా మారుతున్నాయి. వాస్తవానికి ఏ ఆలయం లేదా మతపర ప్రాచుర్యం కల్గిన ప్రాంతాన్ని ప్రభుత్వాలు పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సంకల్పిస్తే అక్కడ కోట్ల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. పెరిగే పర్యాటకులకనుగుణంగా అక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులోకొస్తాయి. తద్వారా ఆ ప్రాంతానికి ప్రాచుర్యం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ మతానికి చెందిన ప్రార్థనా సంస్థలనైనా ప్రభుత్వాలు పర్యాటక కేంద్రాలుగా తీర్చి దిద్దేందుకు ముందుకొస్తే ఎక్కడా ఎటువంటి వ్యతి రేకత వ్యక్తంకాదు. కానీ జార్ఖండ్‌లో ఇందుకు భిన్న మైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు తమ పవిత్ర స్థలాల పరిరక్షణపట్ల జైన మతస్తుల్లో నెలకొన్న నిబద్ధతే కారణంగా పేర్కొనచ్చు.
జార్ఖండ్‌ రాష్ట్రంలోని పార్శనాధ్‌ జైనుల పుణ్య క్షేత్రం. ఇది ఆ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన కొండ ప్రాంతం. దీన్ని జైనులు సమ్మద్‌ శిఖర్జీగా పిలుస్తారు. జైనమతానికి చెందిన 24మంది తీర్థంకరుల్లో 20 మంది ఇక్కడే మోక్షాన్ని పొందారు. అందుకే ఈ ప్రాంతమంటే జైనులకు అత్యంత పవిత్ర భావం.
ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందు కు జార్ఖండ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆలయ పరి సరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిసా ్తమని పేర్కొంది. అలాగే కొండపైకి వెళ్ళేందుకు ఘాట్‌ రోడ్‌ నిర్మాణానికి పూనుకొంది. ఆలయ పరిసరాల్లో భక్తులకోసం వసతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం దాదాపు రూ.40 కోట్ల వ్యయం తో ప్రతిపాదనల్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ ప్రతి పాదనలను జైనమతస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. జైనులకు ఈ కొండ ప్రాంతం చాలా పవిత్ర మైనది. మరీ ముఖ్యంగా జైనుల్లోని దిగంబరులు, శ్వేతాంబరులకు ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇక్కడ జైనమందిరంతోపాటు జైన తీర్థంకరుల పాద ముద్రలు ఉన్నాయి. ఈ పాదముద్రల్ని జైనులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
ప్రస్తుతం ఇక్కడకు జైనులు మాత్రమే వస్తు న్నారు. దీంతో ఈ ఆలయానికి ఇతర మతస్తుల్లో పెద్ద గా ప్రాచుర్యం లేదు. ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రం గా అభివృద్ధిపర్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఇతరుల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించాలన్నది జార్ఖండ్‌ ప్రభుత్వ ఆలోచన. పర్యాటక కేంద్రంగా అభివృద్దిపర్చి తగిన సదుపాయాలు కల్పిస్తే ఈ శిఖర్జీ ప్రాధాన్యం మరింత ప్రాచుర్యంలోకొస్తుంది. ఇక్కడికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందలమందికి ఉపాధి లభిస్తుంది. తమ రా|ష్టానికి పర్యాటక కేంద్రంగా పేరొస్తుందన్నది ప్రభుత్వ వాదన. అయితే జైనులు ప్రభుత్వ ఆలోచనను ఆమోదించడ ం లేదు. ఇక్కడికి ఇతర మతాలవారిని రానిస్తే ఆలయ ప్రాధాన్యత తగ్గుతుందన్నది వారి ఆలోచన. అభివృద్ధి పేరిట ఆలయ పరిసరాల్ని ప్రభుత్వం అపవిత్రం చేసే ప్రయత్నం చేస్తుందంటూ వారు ఆందోళనకు దిగారు. జైనులు ఎక్కువగా ప్రశాంతతను ఇష్టపడతారు. తమ ప్రత్యేక ఉనికిని కాపాడుకుంటారు. దేశంలో 135కోట్ల జనాభాలో జైనుల సంఖ్య 95 లక్షలు మాత్రమే. మహా రాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, జార్ఖండ్‌లలో జైనులు ఎక్కువగా కనిపిస్తారు. దేశం లోని పలు రా|ష్టాల్లో జైనుల్ని మైనార్టీలుగా గుర్తిం చారు. జైనుల జీవన విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు పూర్తిగా శాఖాహారులు. సృష్టిలో ప్రతీ జీవికి సమాన హక్కులున్నాయన్నది వీరి విశ్వాసం. చిన్నపాటి పురుగులు, క్రిమికీటకాలకు కూడా జీవించే స్వేచ్చనివ్వడం వీరి నైజం. వీరు ఎక్కువగా ఆలయాల్లో ఒంటరిగా ప్రార్థనలు నిర్వహించుకునేందుకే ప్రాధా న్యతనిస్తారు.
అభివృద్ధి పేరిట తమ పుణ్యక్షేత్రానికి జనం తాకిడి ఎక్కువైతే తమ ప్రశాంతత దెబ్బతింటుందనేది వీరి ఆందోళనకు కారణం. దీన్ని ఒక వ్యాపారకేంద్రంగా మార్చడం వారికేమాత్రం ఇష్టంలేదు. శిఖర్జీ ఎప్పటికీ ఆధ్యాత్మిక క్షేత్రంగానే ఉండాలనేది వీరి నిశ్చిత అభిప్రాయం.
జార్ఖండ్‌ ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఇప్పు డు జైనులు సేవ్‌ శిఖర్జీ పేరిట ఆందోళన చేప ట్టారు. తొలుత జార్ఖండ్‌లో మొదలైన ఉద్యమం అంచె లంచెలుగా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇటీవల ముం బాయిలో జైనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లి లోని ఇండియా గేట్‌వద్ద కూడా వేలసంఖ్యలో జైనులు నిరసన ప్రదర్శన చేశారు. జార్ఖండ్‌లోని రాజధాని నగరం రాంచీతో సహా ఇతర ప్రాంతాలన్నింటిలో జైను ల ఆందోళనలు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూ డా జైనుల ఆందోళనలు ప్రవేశించాయి. ఇతర మతా లకు భిన్నంగా పదిమంది జైనులున్న ప్రాంతాల్లో కూడా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. సాధా రణంగా ఏ మతంలోనైనా తమ పవిత్ర స్థలాల్లో కోట్లు ఖర్చుపెట్టి అ³భివృద్ది కార్యక్రమాల నిర్వహణకు ముందుకొస్తే స్వాగతించడం పరిపాటి. కానీ జైనుల ఆలోచనలు ఇందుకు భిన్నం. అభివృద్దికంటే వారి ప్రశాంతతనే కోరుకుంటున్నారు. జనసమర్ధంకంటే వారు ఏకాగ్రతకే పెద్దపీట వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement