Tuesday, November 26, 2024

పొద్దున్న ఉక్కు కోసం… ఇప్పుడు రాజధాని కోసం… పట్టించుకున్న నాథుడే లేడు

మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి విజయకేతనం ఎగురవేసింది. అయితే ఉదయం విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ బ్యాలెట్ బాక్స్ లో స్లిప్పులు కనిపించగా ఇప్పుడు అమరావతిలో జై అమరావతి అని రాసి ఉన్న క్లిప్పులు కనిపించాయి. బెజవాడ కార్పొరేషన్ పరిధిలోని 8 వ డివిజన్ లో ఈ స్లిప్పులు బయట పడ్డాయి. గత ప్రభుత్వం నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకొని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు కొన్ని నిర్మాణాలు చేపట్టింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారింది.

వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతి ముంపుకు గురయ్యే ప్రాంతంగా నివేదిక రావడంతో విశాఖ నుంచి పరిపాలన, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ ఇలా మూడు రాజధానులు గా నిర్ణయించారు. అప్పటి నుంచి కూడా అమరావతి ప్రాంత రైతులు అంతా ఆందోళన బాట పట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చామని ఇప్పుడు ఎక్కడో రాజధాని పెడతానంటే ఊరుకునేది లేదంటూ నిరసన తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement