హైదరాబాద్ – కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసించారు.. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు చాలా మంది నిరుపేదల కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఇస్తోన్న లక్షా 16 వేల రూపాయలు ఇవ్వడం అభినందించ దగ్గ విషయమేనని, కానీ ఈ డబ్బు నిరుపేదలకు సరిపోవడం లేదన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇస్తున్న లక్షా 16 వేలకు నుంచి రెండు లక్షలకు పెంచాలని జగ్గారెడ్డి కోరారు. ధనవంతులు బంగారం కొనుక్కుని, ఆడంబరంగా పెళ్లి చేస్తారని కానీ నిరుపేదలు పెళ్లి చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తోందని అంటూ ప్రొత్సాహం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు